ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ వచ్చేసాయి. టెస్ట్ ఆటగాళ్ల ర్యాంకింగ్స్ ని ఐసీసీ విడుదల చేసింది. ఇటీవల ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి తొలిసారి టాప్ టెన్ లో స్థానం దక్కలేదు. నాలుగు స్థానాలు కోల్పోయి 13వ ప్లేస్ కు చేరుకున్నాడు. 2016 తర్వాత టెస్టు ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ స్థానం కోల్పోవడం ఇదే తొలిసారి. ఇటు యువ ఆటగాడు రిషబ్ పంత్ తన స్థానాలను మెరుగుపరుచుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు వ టెస్టులో సెంచరీ, ఆఫ్ సెంచరీతో అలరించాడు. దీంతో అతడు టాప్ 5 లో కి వెళ్ళాడు.
ICC test rankings: టాప్ టెన్ లో రిషబ్ పంత్.. నిరాశపరిచిన విరాట్ కోహ్లీ
-