వెస్టిండీస్ తో టీ 20 సిరీస్ లో భాగంగా నేడు మూడో టీ 20 మ్యాచ్ కోల్‌కత్తలోని ఈడెన్ గార్డెన్ లో జరుగుతుంది. కాగ ఈ మ్యాచ్ లో టాస్ ఓడి.. టీమిండియా మొదటగా బ్యాటింగ్ చేసింది. టీమిండియా పూర్తిగా కొత్త ప్రయోగాలతో బరిలోకి దిగింది. ఓపెనర్ గా రోహిత్ శర్మ కాకుండా.. రుతురాజ్ గైక్వాడ్ ఓపనింగ్ కు వచ్చాడు. అలాగే మరో ఓపెనర్ గా ఇషన్ కిషన్ వచ్చాడు. కాగ రుతురాజ్ (4) విఫలం అయ్యాడు. కిషన్ (34) పరుగులతో రాణించాడు. రోహిత్ శర్మ (7) విఫలం అయ్యాడు.
శ్రేయస్ అయ్యార్ (25) చేశాడు. కాగ చివర్లో మిడిల్ ఆర్డర్లు.. సూర్య కుమార్ యాదవ్ (65) పరుగులు, వెంకటేశ్ అయ్యార్ (35) నాటౌట్ గా రాణించారు. దీంతో టీమిండియా స్కోరు పరుగులు పెట్టింది. సూర్య కుమార్ యాదవ్.. 7 సిక్స్ లతో వీర విహారం చేశాడు. ఏకం గా 200 స్ట్రైక్ రేటు తో ప్రత్యర్థి జట్టును చీల్చి చెండాడు. వెంకటేశ్ అయ్యార్ కూడా 4 ఫోర్లు, 2 సిక్స్ లతో దాటి గా ఆడాడు. దీంతో టీమిండియా నిర్ణత ఓవర్లలో ఐదు వికెట్లు కొల్పోయి.. 184 పరుగులు చేశారు. కాగ వెస్టిండీస్ బౌలర్లు.. హోల్డర్, షెఫర్డ్, రోస్టన్, హైడెన్, డ్రెక్స్ తలో ఒక వికెట్ తీశారు. కాగ వెస్టిండీస్ విజయం సాధించాలంటే.. 185 పరుగులు చేయాల్సి ఉంటుంది.