అహ్మ‌దాబాద్ టెస్టు.. రెండో రోజు ఆట ముగిసే స‌మయానికి భార‌త్ 294/7..

-

అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో కొన‌సాగుతున్న చివ‌రి టెస్టు రెండో రోజు ఆట ముగిసే స‌మయానికి భార‌త్ 7 వికెట్ల న‌ష్టానికి 294 ప‌రుగుల స్కోరు వ‌ద్ద కొన‌సాగుతోంది. ఇంగ్లండ్‌పై భార‌త్ ప్ర‌స్తుతం 89 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.

24/1 ఓవ‌ర్ నైట్ స్కోరుతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొన‌సాగించిన భార‌త్ వికెట్ల‌ను కోల్పోయిన‌ప్ప‌టికీ ఆట ముగిసే స‌మయానికి ఇంగ్లండ్ క‌న్నా కాస్తంత మెరుగైన స్థితికే చేరుకుంది. రెండో రోజు ఆట‌లో రిష‌బ్ పంత్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. మొత్తం 118 బంతులు ఆడిన పంత్ 13 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 101 ప‌రుగులు చేశాడు. అలాగే వాషింగ్ట‌న్ సుంద‌ర్ 117 బంతుల్లో 8 ఫోర్ల‌తో 60 ప‌రుగులు చేసి నాటౌట్‌గా కొన‌సాగుతున్నాడు. ప్ర‌స్తుతం క్రీజులో సుంద‌ర్‌, అక్ష‌ర్ ప‌టేల్‌లు కొన‌సాగుతున్నారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 205 ప‌రుగుల‌కు ఆలౌట్ అయిన విష‌యం విదిత‌మే.

రెండో రోజు ఆట‌లో ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో జేమ్స్ ఆండ‌ర్స‌న్ 3 వికెట్లు తీశాడు. బెన్ స్టోక్స్‌, జాక్ లీచ్‌లు చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. కాగా భార‌త ఇన్నింగ్స్ లో రోహిత్ శ‌ర్మ 49 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద ఔట్ అవ్వ‌గా, కెప్టెన్ కోహ్లి డ‌కౌట్‌గా వెనుదిరిగాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version