పూణెలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేసింది. ఆరంభంలో వికెట్లను కోల్పోయినా నెమ్మదిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో భారత్ 336 పరుగుల భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, కోహ్లిలు రాణించారు. 114 బంతులు ఆడిన రాహల్ 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 108 పరుగులు చేయగా, పంత్ 40 బంతుల్లో 3 ఫోర్లు 7 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. కోహ్లి 79 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 66 పరుగులు చేశాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (35 పరుగులు, 1 ఫోర్, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది.
ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టోప్లే, టామ్ కుర్రాన్‌లు చెరో 2 వికెట్లు తీశారు. శామ్ కుర్రాన్, ఆదిల్ రషీద్‌లు చెరొక వికెట్ తీశారు.