ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ టెస్ట్ సిరీస్ ను ఇండియా 1 – 0 తో గెలుచుకుంది. మాములుగా అయితే రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను స్వీప్ చేయాల్సి ఉండగా, ఆఖరి రోజు పూర్తిగా వర్షం అడ్డంకిగా నిలవడంతో డ్రా గా ముగిసింది. మొదటగా టాస్ గెలిచిన వెస్ట్ ఇండీస్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోగా కోహ్లీ (121) సెంచరీ చేయడంతో ఇండియా 438 పరుగులు చేసింది. ఇక విండీస్ మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 255 పరుగులకు పరిమితం అయింది. సిరాజ్ చెలరేగి అయిదు వికెట్లతో అదరగొట్టాడు. ఇండియా రెండవ ఇన్నింగ్స్ లో 181 పరుగులకు ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఇక భారీ లక్ష్యఛేదనతో రెండవ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన విండీస్ నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి 76 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది.
కానీ అయిదవ రోజు ఆటలో ఒక్క ఓవర్ కూడా పడకుండా వర్షార్పణం కావడంతో మ్యాచ్ కాస్తా డ్రా గా ముగిసింది. ఈ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన మహమ్మద్ సిరాజ్ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.