దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 13వ టోర్నమెంట్ చివరి దశకి వచ్చేసింది. లీగ్ మ్యాచులు పూర్తవుతున్న వేళ ప్లే ఆఫ్ మ్యాచుల షెడ్యూలు వివరాలు బయటకి వచ్చాయి. ఈ మేరకు బీసీసీఐ ప్లే ఆఫ్ మ్యాచుల వివరాలు వెల్లడి చేసింది. మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ప్లే ఆఫ్ కి చేరుకుంటాయన్న సంగతి తెలిసిందే. అందులో మొదటి, రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరిగే మ్యాచులో గెలిచిన వాళ్ళు డైరెక్టుగా ఫైనల్ చేరుకుంటారు. ఆ తర్వాత మూడు నాలుగు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరిగే మ్యాచులో గెలిచిన వాళ్ళు మొదటి మ్యాచులో ఓడిన జట్టుతో ఆడాల్సి ఉంటుంది. ఇందులో గెలిచిన వాళ్ళు ఫైనల్ కి చేరుకుంటారు.
మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరిగే మొదటి క్వాలిపైయర్ మ్యచ్ నవంబర్ 5వ తేదీన జరగనుంది. ఆ తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్ నవంబర్ 6వ తేదీన, క్వాలిఫైయర్ 2 మ్యాచు నవంబర్ 8వ తేదీన జరగనుంది. ఈ రెండు మ్యాచులు అబుదాబిలో జరుగుతాయి. ఆ తర్వాత ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా నవంబర్ 10వ తేదీన జరగనుంది.