ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ మళ్లీ కెప్టెన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈసారి వార్నర్‌కు దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అవకాశం వచ్చింది. ఈ ఫ్రాంఛైజీకి కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్ గతేడాది చివరన ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో పంత్‌కు తీవ్ర గాయాలవ్వడంతో పలు కీలక సిరీస్‌లకు దూరమయ్యాడు. తాజాగా ఐపీఎల్ 2023 కూడా ఆడటం లేదు.
ఈ నేపథ్యంలో పంత్ స్థానంలో అనుభవజ్ఞుడిని కెప్టెన్‌గా నియమించుకోవాలని దిల్లీ క్యాపిటల్స్ భావించింది. ఈ క్రమంలో ఐపీఎల్‌లో సుదీర్ఘకాలం కెప్టెన్‌గా పనిచేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు కెప్టెన్‌గా అవకాశం ఇచ్చింది.
2015లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత ఒకసారి హైదరాబాద్‌ఉ ఛాంపియన్‌గా నిలిపాడు. ఐదు సార్లు ప్లేఆఫ్స్ వరకు తీసుకెళ్లాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌ల్లో ఒకటిగా నిలిపాడు. కానీ పలు అనివార్య కారణాల వల్ల 2021 ఐపీఎల్ సీజన్ మధ్యలో తన కెప్టెన్సీని కోల్పోయాడు. ఆ తర్వాత జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. ఇక గత ఏడాది ఐపీఎల్‌ల్లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. ఇప్పుడు ఆ జట్టుకు కెప్టెన్‌గా మారాడు.
David Warner 👉🏼 (𝗖)
Axar Patel 👉🏼 (𝗩𝗖)All set to roar loud this #IPL2023 under the leadership of these two dynamic southpaws 🐯#YehHaiNayiDilli | @davidwarner31 @akshar2026 pic.twitter.com/5VfgyefjdH
— Delhi Capitals (@DelhiCapitals) March 16, 2023