THALA IS BACK : ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే ధోని రికార్డు.. తొలి భార‌త్ ఆట‌గాడిగా ఘ‌న‌త‌

-

ఐపీఎల్-2022 శ‌నివారం అట్ట‌హాసంగా ప్రారంభం అయింది. తొలి మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్, కోల్‌క‌త్త నైట్ రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. కాగ ఈ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. చెన్నై ఓట‌మి పాలైనా.. ధోని మెరుపు ఇన్నింగ్స్ తో అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. దాదాపు మూడు సీజ‌న్ ల తర్వాత‌.. ధోని హాప్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ధోని చివ‌రి సారి గా 2019 లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ జ‌ట్టుపై అర్థ శ‌త‌కం చేశాడు.

మ‌ళ్లీ శ‌నివారం… కోల్‌క‌త్త నైట్ రైడ‌ర్స్ జ‌ట్టుపై హాప్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. అయితే దీంతో పెద్ద వ‌య‌సులో అర్థ శ‌త‌కం బాదిన భార‌త ఆట‌గాడిగా ధోని రికార్డు న‌మోదు చేశాడు. గ‌తంలో ఈ రికార్డు రాహుల్ ద్రావిడ్ పేరుపై ఉండేది. ద్రావిడ్ 40 ఏళ్ల 116 రోజుల వ‌య‌స్సులో హాప్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. #

కానీ ధోని శ‌నివారం త‌న 40 ఏళ్ల 262 రోజుల వ‌య‌సులో అర్థ శ‌త‌కం చేశాడు. కాగ ఈ మ్యాచ్ లో ధోని కేవ‌లం 38 బంతుల్లోనే 50 ప‌రుగులు చేశాడు. అందులో 7 ఫోర్లు.. ఒక సిక్స్ కూడా ఉన్నాయి. ధోని ఇన్నింగ్స్ పై సీనియ‌ర్లు ట్వీట్స్ చేశారు. ధోనిని అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news