Womens IPL : క్రికెట్ అభిమానుల‌కు గుడ్ న్యూస్.. మ‌హిళ‌ల‌ ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్న‌ల్

-

క్రికెట్ అభిమానుల‌కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వ‌చ్చే ఏడాది నుంచి ఉమెన్స్ ఐపీఎల్ ను ప్రారంభిస్తామ‌ని బీసీసీఐ ప్ర‌క‌టించింది. కాగ గ‌త కొద్ది రోజుల నుంచి మెన్స్ ఐపీఎల్ త‌ర‌హాలో ఉమెన్స్ ఐపీఎల్ ను ప్రారంభించాల‌నే డిమాండ్ వ‌స్తుంది. కాగ ఈ డిమాండ్ నెర‌వేరే రోజులు వ‌స్తున్నాయి. కాగ ఈ రోజు బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ.. ఈ రోజు ముంబైలో జ‌రిగిన ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ మ‌హిళా ఐపీఎల్ పై వ‌స్తున్న డిమాండ్స్ పై స్పందించారు.

వ‌చ్చే ఏడాది నుంచి ఉమెన్స్ ఐపీఎల్ ను నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు. మెన్స్ ఐపీఎల్ త‌ర‌హాలోనే ఆరు జ‌ట్లతో కూడిన ఉమెన్స్ ఐపీఎల్ ను నిర్వ‌హించాలని బీసీసీఐ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ ప్ర‌క‌టించారు. అయితే గ‌తంలో కూడా ఉమెన్స్ ఐపీఎల్ పేరుతో లీగ్ నిర్వ‌హించారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి వ‌ల్ల నిర్వ‌హించ‌లేదు. తాజా గా సౌర‌వ్ గంగూలీ ప్ర‌క‌ట‌నతో మ‌రోసారి ఉమెన్స్ ఐపీఎల్ తెర‌పైకి వ‌చ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version