Ipl 2022: ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ కు ఫిదా అయిన మంత్రి కేటీఆర్..ట్విట్టర్ వేదికగా ప్రశంశలు..

-

సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అద్భుత బౌలింగ్ పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. “రా పేస్ తో నిండిన నమ్మశక్యం కాని స్పెల్ * ఉమ్రాన్ మాలిక్” అంటూ రాసుకొచ్చారు.అలాగే బహుశా ఇది ఐపీఎల్ లో అత్యుత్తమ ఓవర్ అయి ఉంటుందని చప్పట్లతో అభినందిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.అలాగే ఉమ్రాన్ మాలిక్ వేసిన అద్భుత ఓవర్ కు సంబంధించిన గణాంకాలు ఉన్న ఫోటోను మంత్రి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

కేటీఆర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కాగా కేటీఆర్ సమయం దొరికినప్పుడల్లా క్రికెట్ మ్యాచ్ లను వీక్షిస్తుంటారు.గతంలో భారత్ జట్టు మంచి విజయాలు సాధించినప్పుడు కూడా మంత్రి ట్విట్టర్ ద్వారా అభినందించేవారు.కాగా ఆదివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఉమ్రాన్ మాలిక్ చెలరేగాడు.చివరి ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మేడిన్ చేసి మూడు వికెట్లు తీశాడు.చివరి బంతికి ఓ రనౌట్ కూడా లభించడంతో పంజాబ్ కింగ్స్ 151 పరుగులకే ఆలౌట్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news