పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట..ఇకపై ఇంటి భోజనం!

-

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. చర్లపల్లి జైల్లో స్పెషల్ బ్యారేక్ ఇవ్వాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేసింది. తోటి ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారేక్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పట్నం నరేందర్ రెడ్డి కి స్పెషల్ బ్యారేక్ ఇవ్వాలని చర్లపల్లి జైలు సూపర్డెంట్ కు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

patnam narendhar reddy

ఇంటి భోజనం అనుమతించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. క్వాష్ పిటిషన్ ఫై జస్టిస్ శ్రీదేవి బెంచ్ మరికాసేపట్లో విచారణ జరుపనున్నారు. దీం తో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. కాగా. లగచర్లలో కలెక్టర్‌ పై రైతులు దాడి చేసిన సంఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news