ఐపీఎల్ 2023 : రోహిత్ VS పాండ్య… గెలుపు అవకాశాలు ఆ జట్టుకే !

-

ఈ రోజు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ మరియు ముంబై జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ లో గుజరాత్ గెలుస్తోగెలుపు … ఓటమి ఇలా సాగుతోంది తమ ప్రదర్శన, నిలకడగా విజయాలను సాధించడంలో విఫలం అవుతోంది. ఉదాహరణకు గత మ్యాచ్ లో అదృష్టం కలిసొచ్చి గుజరాత్ లక్నౌ పై గెలిచింది, కానీ ఓడిపోయే మ్యాచ్ అని చెప్పాలి. దానితో ఆడిన 6 మ్యాచ్ లలో 4 గెలిచి పాయింట్ల పట్టికలోనూ నాలుగవ స్థానంలో ఉంది. ఇక ముంబై మొదట్లో వరుసగా ఓడినా ఆఖరి మ్యాచ్ లలో గెలిచి… ఆడిన 6 మ్యాచ్ లలో 3 గెలిచి ఏడవ స్థానంతో సరిపెట్టుకుంది. కాగా గత సీజన్ లో ముంబై మరియు గుజరాత్ లు ఒకసారి తలపడగా అయిదు పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం అందుకుంది.

మరి ఈ రోజు జరగనున్న మ్యాచ్ లో ముంబై తన ఆధిక్యాన్ని పెంచుకుంటుందా లేదా గుజరాత్ తో ఓడిపోయి సమం చేసుకుంటుందా చూడాలి. అయితే గెలిచి అవకాశాలు ఎక్కువగా మాత్రం ముంబై కే ఉన్నాయని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version