కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణ ప్రజలకు అంత లాభం – హరీష్ రావు

-

సీఎం కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణ ప్రజలకు అంత లాభం అని అన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ ఒక ఉద్యమ జ్వాల, అభివృద్ధి జ్వాల అంటూ ప్రశంసించారు. సిద్దిపేటలో బిఆర్ఎస్ ప్రతినిధుల సభలో హరీష్ రావు మాట్లాడుతూ.. వచ్చే రెండు నెలల్లో సిద్దిపేటకు రైలు వస్తుందని తెలిపారు. ప్రధాని మన్ కి బాత్ లో తియ్య తీయని మాటలు చెబుతారని.. మన్ కీ బాత్ కాదు కిసాన్ బాత్ వినాలని సూచించారు. అదాని, అంబానీ ల ఆస్తులు పెంచడమే బిజెపి పని అని విమర్శించారు.

ప్రధానమంత్రి మోదీ చేసిన తప్పులను ప్రశ్నిస్తే సీబీఐ, ఈడి, ఐటీ రైడ్స్ చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం అదరగొడితే బెదిరిపోయే నేత కేసీఆర్ కాదన్నారు హరీష్ రావు. కొందరికి కేసీఆర్ అని తిట్టడం ఫ్యాషన్ గా మారిందని.. సూర్యుడిపై ఉమ్మేస్తే ఏం జరుగుతుందో వారు తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణకు సమాధులు తవ్వేటోడు, కూలగొట్టేటోడు కాదు.. బలమైన పునాదులు కావాలన్నారు. తాను సిద్దిపేట ప్రజలకు చివరి శ్వాస వరకు సేవ చేస్తానన్నారు హరీష్ రావు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని.. రైతులు అధైర్యపడవద్దని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version