IPL Auction : నేడే మెగా వేలం.. ప్ర‌క్రియా ఇలాగే..!

-

ఐపీఎల్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెగా వేలం వ‌చ్చేసింది. మ‌రి కొద్ది గంట‌ల్లో ఈ మెగా వేలం ప్రారంభం కాబోతుంది. ఈ మెగా వేలం స్టార్ స్పోర్ట్స్ కూడా ప్ర‌త్యేక ప్ర‌సారం చేయ‌బోతుంది. కాగ ఐపీఎల్ 2022 కోసం ఈ మెగా వేలం జ‌రుగుతుంది. బెంగ‌ళూర్ లో ఉద‌యం 11 గంట‌ల‌కు ఈ మెగా వేలం జ‌ర‌గ‌బోతుంది. కాగ ఈ వేలంలో కొత్త‌గా వ‌చ్చిన వాటితో క‌లిపి మొత్తం ప‌ది ఫ్రొంఛైజీలు పాల్గొంటాయి. త‌మ జ‌ట్ల‌ను విజ‌య‌తీరాల‌కు తీసుకెళ్లే నాణ్య‌మైన ఆట‌గాళ్ల పై కోట్లు కుమ్మ‌రించ‌డానికి సిద్ధం అవుతున్నాయి.

ఈ వేలంలో ముఖ్యంగా శ్రేయ‌స్ అయ్యార్, శిఖ‌ర్ ధావ‌న్, డేవిడ్ వార్న‌ర్, ర‌బ‌డ‌, డికాక్, దేవద‌త్ ప‌డిక్క‌ల్, అశ్విన్, సురైష్ రైనా, అంబాటి రాయుడు వంటి కీల‌క ఆట‌గాళ్ల‌పై భారీ పోటీ నెల‌కొనే అవ‌కాశం ఉంది. కాగ ఈ మెగా వేలం ప్ర‌క్రియా.. ఆట‌గాళ్ల‌ను వారి ప్ర‌త్యేకతల ఆధారంగా సెట్ల‌ను విభ‌జిస్తారు. ఒక్కో సెట్ లో బ్యాట్స్ మెన్స్, స్పిన్ బౌల‌ర్లు, ఫాస్ట్ బౌల‌ర్లు, ఆల్ రౌండ‌ర్లు, వీకిట్ కీప‌ర్లు తో పాటు ఆన్ క్యాప‌డ్ ప్లేయ‌ర్లు ఇలా సెట్ల‌ను విభ‌జిస్తారు. ఒక్కో సెట్ లో ఆట‌గాళ్లను అనౌన్స్ చేసిన త‌ర్వాత వేలం ప్రారంభం అవుతుంది. కాగ ఈ సారి రైట్ టు మ్యాచ్ అనే ఆప్షన్ ఐపీఎల్ నిర్వ‌హ‌కులు తొల‌గించారు. దీంతో ఆట‌గాళ్లు ఏ ఫ్రొంఛైజీ డ‌బ్బు ఎక్కువ పెడితే.. ఆ ఫ్రొంఛైజీకే ద‌క్కుతారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version