ఈ ఏడాది ఐపీఎల్ కు ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జాయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు నేడు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ నెగ్గింది. కెప్టెన్ హర్ధిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కెఎల్ రాహుల్ సారథ్యంలో ఉన్న లక్నో సూపర్ జాయింట్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్ (0), డి కాక్ (7) విఫలం అయ్యారు. తర్వాత వచ్చిన ఎవిన్ లూయిస్ (10), మనీశ్ పాండే (6) కూడా నిరాశ పర్చారు.
కానీ దీపక్ హుడా (55) తో పాటు ఆయూష్ బడోని (54) రాణించారు. దీంతో లక్నో సూపర్ జాయింట్స్ జట్టు పుంజుకుంది. వీరికి తోడు కృనల్ పాండ్య (21) పర్వలేదనిపించాడు. దీంతో లక్నో జట్టు.. నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. 158 పరుగులు చేసింది. కాగ గుజరాత్ బౌలర్లు.. మహ్మద్ షమీ 3 వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ అరోన్ 2, రషీద్ ఖాన్ 1 వికెట్ తీసుకున్నాడు. కాగ ఈ మ్యాచ్ లో గుజరాత్ విజయం సాధించాలంటే.. 159 పరుగులు చేయాల్సి ఉంటుంది.