గ‌డ్డం ఉంటేనే ఉద్యోగం.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు అల్టిమేటం జారీ చేసిన‌ తాలిబ‌న్లు

-

ఆఫ్ఘ‌నిస్థాన్ లో తాలిబ‌న్ల ప్ర‌భుత్వం వ‌చ్చిన నాటి నుంచి ప్ర‌జ‌ల‌పై క‌ఠిన‌మైన ఆంక్షలు విధిస్తుంది. అంతే కాకుండా.. కొత్త నిబంధ‌న‌ల‌ను కూడా తాలిబ‌న్ల ప్ర‌భుత్వం అమ‌లు చేస్తుంది. ఈ నిబంధ‌న‌లు ప్ర‌జ‌లకు మాత్ర‌మే కాకుండా.. ప్ర‌భుత్వ అధికారుల‌కు కూడా వ‌ర్తించేలా.. చూస్తుంది. అయితే తాజా గా తాలిబ‌న్లు జారీ చేసిన ఒక నిబంధ‌న.. ప్ర‌భుత్వ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. ప్ర‌భుత్వం ఉద్యోగం చేయాలంటే.. త‌ప్ప‌క గ‌డ్డం ఉండాల‌ని అల్టిమేటం జారీ చేశారు.

గ‌డ్డం లేని వారు… ఉద్యోగానికి రావ‌ద్ద‌న్ని హుకం జారీ చేశారు. దీంతో ప్ర‌భుత్వ ఉద్యోగులు అంద‌రూ కూడా గడ్డం పెంచుకునే ప‌నిలో పడ్డారు. అయితే తాజా గా తిలిబ‌న్ల ప‌బ్లిక్ మొరాలిటీ మంత్రిత్వ శాఖ కొన్ని నిబంధ‌న‌లు తీసుకువ‌చ్చింది. ప్ర‌తి ప్ర‌భుత్వ ఉద్యోగికి గ‌డ్డం ఉండాలని, ఎవ‌రూ కూడా గడ్డం తీయ‌వ‌ద్ద‌ని సూచించింది. అలాగే ప్ర‌భుత్వ ఉద్యోగులు డ్రెస్ కోడ్ పాటించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్ర‌భుత్వ ఉద్యోగులు ఈ నిబంధ‌న‌లు పాటిస్తున్నారా.. లేదా.. అని ప్ర‌భుత్వ కార్యాల‌య వ‌ద్ద తాలిబ‌న్ల ప్ర‌భుత్వం పెట్రోలింగ్ కూడా నిర్వ‌హిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news