IPL LSG vs RR : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో

-

ఐపీఎల్ 2022 లో భాగంగా ఈ రోజు రెండు మ్యాచ్ లు జ‌రుగుతున్న విషయం తెలిసిందే. కాగ ప్ర‌స్తుతం… 20వ మ్యాచ్ గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య‌ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కీల‌క‌మైన టాస్ ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ గెలిచింది. దీంతో కెప్టెన్ కెఎల్ రాహుల్.. ముందుగా బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. దీంతో సంజు శాంసన్ కెప్టెన్సీలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.

కాగ వాంఖ‌డే స్టేడియంలో పిచ్ కాస్త పొడిగా ఉంది. కొంత వ‌ర‌కు స్పీన్ కు అనుకూలించే అవ‌కాశం ఉంది. అలాగే బ్యాటింగ్ ప‌రంగా ఈ పిచ్ పై భారీ స్కోర్ న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంది. కాగ ఈ మ్యాచ్ లో ఇరు తుది జ‌ట్లు ఇలా ఉన్నాయి.

రాజస్థాన్ రాయల్స్ తుది జ‌ట్టు :
జోస్ బట్లర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్ / వికెట్ కీప‌ర్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, కుల్దీప్ సేన్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్

లక్నో సూపర్ జెయింట్స్ తుది జ‌ట్టు :
కెఎల్ రాహుల్ ( కెప్టెన్ ), క్వింటన్ డి కాక్ ( వికెట్ కీప‌ర్ ), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్

Read more RELATED
Recommended to you

Exit mobile version