IPL MI vs RCB : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగ‌ళూర్

-

ఐపీఎల్ 2022 లో భాగంగా ఈ రోజు ముంబై ఇండియ‌న్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ మ‌ధ్య 18వ మ్యాచ్ జ‌రుగుతుంది. ఈ మ్యాచ్ లో కీలక‌మైన టాస్ ను రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ జట్టు గెలిచింది. దీంతో కెప్టెన్ డుప్లెసిస్ మొద‌ట బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. కాగ ఈ మ్యాచ్ లో తొలుత రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలో ఉన్న ముంబై ఇండియ‌న్స్ జట్టు బ్యాటింగ్ చేయ‌నుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు మూడు మ్యాచ్ ల‌లో ఓడిపోయిన ముంబై ఇండియ‌న్స్ ఈ మ్యాచ్ లో గెలిచి ప‌రువు కాపాడుకోవాల‌ని చూస్తుంది. అలాగే బెంగ‌ళూర్ కూడా విజ‌యానికి కావాల్సిన ప్ర‌ణాళిక‌ల‌ను సిద్దం చేస్తుంది. ఈ మ్యాచ్ లో మాక్స్ వెల్ ను రంగంలోకి దించుతుంది. కాగ ఇరు తుది జ‌ట్లు ఇలా ఉన్నాయి.

ముంబై ఇండియన్స్ తుది జ‌ట్టు :
రోహిత్ శర్మ ( కెప్టెన్ ), ఇషాన్ కిషన్ ( వికెట్ కీప‌ర్ ), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, రమణదీప్ సింగ్, మురుగన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, జస్ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జ‌ట్టు :
ఫాఫ్ డు ప్లెసిస్ ( కెప్టెన్ ), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ ( వికెట్ కీప‌ర్ ), డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Exit mobile version