ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో వరస్ట్ పర్ ఫార్మర్ గా కొనసాగుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ ని మిడిలార్డర్ సమస్య వెంటాడుతుంది. ఈ విషయమై కెప్టెన్ రాహుల్ పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్.. వీరిద్దరూ ఔటయితే గనక, ఆ తర్వాత స్కోరుని నిలబెట్టేవారే కనబడడం లేదు. ఈ నేపథ్యంలో మిడిల్ ఆర్డర్ లో వేరే ఒక బ్యాట్స్ మెన్ దింపితే బాగుండుని అని అభిప్రాయపడుతున్నారు. మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా ప్రకారం కే ఎల్ రాహుల్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడని, మాక్స్ వెల్ తనకి సహకారం అందించాలని చూస్తున్నప్పటికీ, అతని సరిగ్గా ఆడట్లేదని చెబుతున్నాడు.
మిడిల్ ఆర్డర్ లో నెట్టుకు రాగలిగే ఒక బ్యాట్స్ మెన్ దొరికితే కెప్టెన్ పై ఒత్తిడి తగ్గి మరింత బాగా ఆడే అవకాశం ఉంటుందని తెలిపాడు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ మాక్స్ వెల్, ఆరు మ్యాచులు ఆడినప్పటికీ ఇంకా కుదురుకోలేదు. ఈ నేపథ్యంలో అతని స్థానంలో క్రిస్ గేల్ ని తీసుకువస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. కానీ క్రిస్ గేల్ పరిస్థితి ఇప్పుడు బాలేదని సమాచారం. మరి పంజాబ్ టీమ్ ఏం చేస్తుందో చూడాలి.