ఐపీఎల్ సీజన్ 16లో ధోనీ సేన చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ జట్టుపై విజయం సాధించింది. సొంత మైదానం చెపాక్‌లో చెన్నై.. 217 పరుగులతో భారీ స్కోరునే నమోదు చేసింది. అయినా లఖ్‌నవూపై కేవలం 12 పరుగుల తేడాతో గెలుపొందింది. దీనికి చెన్నై బౌలర్లు సమర్పించుకున్న అదనపు పరుగులు కూడా ఓ కారణమే. చెన్నై గెలిచినా బౌలర్ల పర్ఫామెన్స్‌పై కెప్టెన్ ధోనీ అసహనానికి గురయ్యాడు. బౌలర్లు ఇలాగే చేస్తే తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు.
‘‘ఫాస్ట్ బౌలింగ్‌ను మేం మెరుగుపర్చుకోవాలి. పరిస్థితులకు తగినట్లుగా బౌలింగ్ చేయాల్సిన అవసరముంది. ప్రత్యర్థి బౌలర్లు ఏం చేస్తున్నారో కూడా గమనించడం చాలా ముఖ్యం. ఇక మరో కీలకమైన విషయమేంటంటే.. బౌలర్లు నోబాల్స్ వేయకుండా బౌలింగ్ చేయాలి. ఎక్స్‌ట్రా వైడ్లు తగ్గించుకోవాలి. ఈ మ్యాచ్‌లో మేం అదనపు పరుగులు ఎక్కువగా ఇచ్చాం. వాటిని తగ్గించుకోవాలి. లేదంటే ఇక కొత్త సారథి కింద ఆడాల్సి ఉంటుంది. ఇది నా రెండో వార్నింగ్. ఇకపై మరోసారి జరిగితే నేను వైదొలుగుతా’’ అని ధోనీ తన బౌలర్లను హెచ్చరించాడు.
#CSK bowlers today bowled 13 wides and 3 no balls against #LSG and Captain @msdhoni, in his inimitable style, had this to say. 😁😆#TATAIPL | #CSKvLSG pic.twitter.com/p6xRqaZCiK
— IndianPremierLeague (@IPL) April 3, 2023