చెన్నై సూపర్‌కింగ్స్‌పై పంజాబ్‌ కింగ్స్‌ విజయం

-

వరుసగా నాలుగు ఓటముల తర్వాత అదిరిపోయే బ్యాటింగ్‌తో గత మ్యాచ్‌లో కోల్‌కతాపై సంచలన విజయం సాధించిన పంజాబ్‌ కింగ్స్‌ టీమ్ మరోసారి కళ్లు చెదిరే పర్ఫామెన్స్ ఇచ్చింది. తన ఆటతో చెన్నై సూపర్‌కింగ్స్‌కు షాకిచ్చింది. స్పిన్నర్లు బ్రార్‌, రాహుల్‌ చాహర్‌ల అద్భుత బౌలింగ్‌తో చెన్నైను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన పంజాబ్‌ కింగ్స్.. బెయిర్‌స్టో, రొసోల మెరుపులతో లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

చెన్నై ముందుంచిన 163 పరుగుల టార్గెట్ను ఈజీగా చేధించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. తొలుత బ్యాటింగ్కు జానీ బెయిర్ స్టో(46; 30 బంతుల్లో 7×4, 1×6) ను బ్యాటింగ్కు దించింది. ధోనీకీ క్యాచ్ ఇచ్చి బెయిర్ స్టో ఔట్ కాగా.. క్రీజులో ఉన్న ప్రభమన్ సింగ్ 13 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. రీలీ రొసో (43; 23 బంతుల్లో 5×4, 2×6) 43 పరుగులకే ఔట్ అయ్యాడు. చివరి 8 ఓవర్లలో పంజాబ్‌కు 50 పరుగులు అవసరమైన సందర్భంలో క్రీజులోకి వచ్చిన శశాంక్‌ సింగ్‌ (25 నాటౌట్‌; 26 బంతుల్లో 1×4, 1×6), సామ్‌ కరన్‌(26 నాటౌట్‌; 20 బంతుల్లో 3×4) భారీ షాట్లు ఆడకపోయినా ఎక్కువగా సింగిల్సే తీసుకుంటూ జట్టును ముందుకు నడిపించారు. 17.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

చెన్నై ఇన్నింగ్స్‌: రహానె (సి) రొసో (బి) బ్రార్‌ 29; రుతురాజ్‌ (బి) అర్ష్‌దీప్‌ 62; దూబె ఎల్బీ (బి) బ్రార్‌ 0; జడేజా ఎల్బీ (బి) చాహర్‌ 2; రిజ్వీ (సి) హర్షల్‌ (బి) రబాడ 21; మొయిన్‌ అలీ (బి) చాహర్‌ 15; ధోని రనౌట్‌ 14; మిచెల్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 18

Read more RELATED
Recommended to you

Exit mobile version