మైదానంలోకి వచ్చిన రోహిత్.. రేపు మ్యాచ్ ఆడతాడా…?

ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 లో గాయం కారణంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చివరి రెండు మ్యాచ్ లకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే అతను సోమవారం తిరిగి మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. రోహిత్ లేకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్‌ చేతిలో ఓటమి పాలైంది. ఆల్ రౌండర్ కీరోన్ పొలార్డ్ మునుపటి 2 ఆటలలో జట్టును నడిపించాడు.

అక్టోబర్ 18 న కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ గాయపడ్డాడు. హిట్‌ మ్యాన్ గాయం నుంచి కోలుకున్నట్లు కనిపిస్తోందని పలువురు అంటున్నారు. అక్టోబర్ 28 న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే తదుపరి మ్యాచ్ కి అతను రెడీ అవుతున్నాడు. వచ్చే నెలలో జరగబోయే ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ టెస్ట్, వన్డే, టీ 20 జట్లలో ఎంపిక లేదు. దీనితో వైస్ కెప్టెన్ గా కెఎల్ రాహుల్ ని ఎంపిక చేసారు.

https://www.instagram.com/p/CG0F1ltMIcL/?utm_source=ig_embed