రాణించిన చెన్నై కెప్టెన్.. హైదరాబాద్ టార్గెట్ ఎంతంటే..?

-

ఐపీఎల్ 2024 లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ కి చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కి దిగిన చెన్నై బ్యాటర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (98) పరుగులు సాధించాడు. త్రుటి లో సెంచరీ మిస్ చేసుకున్నాడు గైక్వాడ్. ఇక మిచెల్ కూడా 32 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఓపెనర్ అజింకా రెహానే మాత్రం 9 పరుగులు మాత్రమే చేసి భువనేశ్వర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.

మరో బ్యాటర్ శివం దూబే కూడా బ్యాటింగ్ లో రాణించాడు. దూబే 20 బంతుల్లో 39 పరుగులు చేశాడు. చివరిలో ధోని బ్యాటింగ్ కి వచ్చి 2 బంతుల్లో 5 పరుగులు చేశాడు. దీంతో చెన్నై 212 పరుగుల స్కోరు చేసింది. ఇక బౌలర్లలో భువనేశ్వర్, నటరాజన్, ఉనద్కత్ తలో వికెట్ తీశారు. చెన్నై నిర్దేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ చేరుకుంటుందో లేక మొన్నటి మాదిరిగా చేతులెత్తేస్తుందో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version