బట్లర్‌కు చాహల్ లవ్‌లీ ప్రపోజ్.. వీడియో వైరల్

-

ఇండియన్ టీమ్ క్రికెటర్స్‌లో నాటీ ప్లేయర్ ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేరు యుజువేంద్ర చాహల్. చాహల్ ఫీల్డ్ ఎంత విధ్వంసం సృష్టిస్తాడో.. ఆఫ్ ది ఫీల్డ్‌లో అంతకుమించి అల్లరి చేస్తాడు. మైదానంలోనే కాదు చాహల్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్. తరచూ డ్యాన్స్ రీల్స్ చేస్తూ సందడి చేస్తూ ఉంటాడు. తాజాగా చాహల్ పోస్టు చేసిన ఓ వీడియో చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. చాహల్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు.

ఇటీవల తన సహచర ఆటగాడైన ఇంగ్లాండ్‌ కెప్టెన్​ జోస్‌ బట్లర్‌ ముందు చాహల్​.. ఓ ఫన్నీ డేటింగ్‌ ప్రపోజల్​ను ఉంచాడు. బట్లర్​ తన కూతురిని ఎత్తుకున్ని ఉన్న సమయంలో అతని దగ్గరికి వెళ్లిన చాహల్​.. చేతిలో ఓ చిన్న పూల కుండీ పట్టుకుని మోకాళ్ల మీద కూర్చుని మరీ ప్రపోజ్‌ చేశాడు. “జోస్ భాయ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వే నా జీవితం. గతేడాది తొలిసారి మిమ్మల్ని చూసినప్పుడే నేను లవ్​లో పడిపోయాను. రోజూ నాకు మీరు గుర్తొస్తూనే ఉంటారు. ప్లీజ్‌ నాతో డేట్‌కు వస్తారా” అంటూ సరదాగా ప్రపోజ్‌ చేశాడు. ఇక చాహల్​ మాటలకు కాస్త సిగ్గుపడిన బట్లర్​ చిరు నవ్వుతో .. “సరే యుజీ.. నేను కచ్చితంగా వస్తాను” అంటూ బదులిచ్చాడు. దీంతో చుట్టుపక్కన వారంతా ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ గట్టిగా నవ్వుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version