ఐపీఎల్ 2022 లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య 20 మ్యాచ్ ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. చివరి బంతి వరకు ఉత్కఠగా సాగిన మ్యాచ్ లో గెలుపు రాజస్థాన్ నే వరించింది. రాజస్థాన్ విధించి 165 పరుగుల టార్గెట్ ను ఛేదించడంలో లక్నో సూపర్ జెయింట్స్ తడపడింది.
చివరి ఓవర్లలో 14 పరుగులు చేయాల్సి ఉండగా.. స్టోనీస్ – అవేశ్ ఖాన్ 11 పరుగులు మాత్రమే చేశారు. దీంతో ఈ మ్యాచ్ రాజస్థాన్ వైపు తిరిగింది. అయితే.. ఈ మ్యాచ్ లో దుష్మంత చమీరాను ఔట్ చేయడం ద్వారా చాహల్ ఐపీఎల్ లో 150 వ వికెట్ సాధించాడు.
తద్వరా ఐపీఎల్ లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్న ఆరో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ లో ఇప్పటి వరకూ 150 వికెట్ల తీసిన వాళ్లు ఐదుగురు ఉన్నారు. డ్వేన్ బ్రావో 173 వికెట్లు, మలింగా 170, అమిత్ మిశ్రా 166, పీయూష్ చావ్లా 157, భజ్జీ 150 వికెట్లు తీసి.. వరుసగా ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక తాజాగా చాహల్ 6 వ స్థానాన్ని దక్కించుకున్నాడు.