యాషెస్ టెస్ట్ సిరీస్ లో భాగంగా మాంచెస్టర్ వేదికగా నాలుగవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను ఇంగ్లాండ్ 317 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో అదరగొడుతోంది. ముఖ్యంగా ఓపెనర్ జాక్ క్రాలీ ఫోర్లతో విరుచుకుపడుతున్నాడు. ఇంగ్లాండ్ కోచ్ గా బృందం మేక్ కలమ్ వచ్చినప్పటి నుండి బ్యాటింగ్ లో జోరు పెరిగింది. ఇక తాజాగా క్రాలీ ఈ టెస్ట్ లో కేవలం 93 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. ఇతను ఆ సమయానికి బంతులను 93 ఎదుర్కొని 12 ఫోర్లు మరియు 1 సిక్సు సహాయంతో వంద పరుగులను పూర్తి చేసుకున్నాడు. కాగా ప్రస్తతానికి ఇంగ్లాండ్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలీ మరియు జో రూట్ లో ఉన్నారు.. ఇద్దరూ నిలకడగా ఆడుతున్నారు.
యాషెస్ టెస్ట్ : ఆస్ట్రేలియాపై 93 బంతుల్లోనే సెంచరీ చేసిన జాక్ క్రాలీ .. !
-