లక్ష గళాలు ఒక్కటై.. జనగణమన పాడిన వేళ.. గూస్​బంప్స్ తెప్పించే వీడియో

-

సాధారణంగా జాతీయ గీతం ఆలపిస్తుంటే సహజంగానే ఉద్వేగం పొంగుకొస్తుంది. అదే.. లక్ష మంది కలిసి ‘జనగణమన’ పాడితే.. దానికి ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ వేదిక అయితే నరాలు ఉప్పొంగుతాయి. నరనరాన దేశభక్తితో హృదయం ఉప్పొంగుతుంది.. శరీరం ఊగిపోతుంది.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. శనివారం రోజున అదే జరిగింది. ఓవైపు నరేంద్ర మోదీ స్టేడియంలో జాతీయ గీతాలాపన చేస్తున్న ప్రేక్షకులు.. మరోవైపు టీవీల ముందు కూర్చున్న అభిమానులు ఇదే ఉద్వేగానికి లోనయ్యారు.

లక్ష మంది ఒకేసారి జాతీయ గీతం ఆలపించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు దేశభక్తితో భావోద్వేగానికి లోనవుతున్నాయి. జై భారత్.. భారత్ మాతా కీ జై.. ఇంతకంటే పవిత్రమైన.. స్వచ్ఛమైన ఎమోషన్ ఇంకేం ఉండదేమో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌- పాక్‌ మెగా పోరును వీక్షించేందుకు వచ్చిన క్రికెట్ ప్రేక్షకులతో అహ్మదాబాద్‌ క్రికెట్‌ జ్వరంతో ఊగిపోయింది. టీమ్‌ఇండియా జెర్సీలు, టోపీలతో స్టేడియం నీలి సంద్రంగా మారిపోయింది. జాతీయ జెండాలు రెపరెపలాడగా.. ‘భారత్‌ మాతా కీ జై’, ‘ఇండియా ఇండియా’ అనే నినాదాలతో స్టేడియం మార్మోగింది.

Read more RELATED
Recommended to you

Latest news