పాకిస్థాన్​ జెర్సీపై మాజీ స్పిన్నర్​ సెటైర్

-

ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం 12 జట్లతోపాటు క్వాలిఫయిర్‌ రౌండ్‌లో పాల్గొనే టీమ్‌లూ రెడీ అవుతున్నాయి. ఇప్పటికే తమ స్క్వాడ్‌లను ప్రకటించిన టీమ్స్.. కొత్త జెర్సీలతో సిద్ధమవుతున్నాయి. పాకిస్థాన్‌ కూడా తమ నూతన జెర్సీని విడుదల చేసింది. తన జెర్సీకి ‘థండర్‌ జెర్సీ’ అని పేరు కూడా పెట్టుకుంది. పాక్ జెర్సీని చూసిన ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా జెర్సీపై సెటైర్ వేశాడు.

“తొలుత పాకిస్థాన్‌ కిట్‌ గురించి మాట్లాడతా. ఆ జెర్సీని చూస్తే పుచ్చకాయను చూసినట్లు అనిపిస్తోంది. అలాగే పండ్లతో ముక్కలను డిజైన్లుగా రూపొందించినట్లు ఉంది. దానిని చూస్తే పండ్ల దుకాణంలో నిలబడి ఉన్నట్లుగా ఉంది. భారత జట్టు జెర్సీ కలర్‌ కొంచెం లైట్‌గా ఉంది. కాస్త డార్క్‌గా ఉంటే బాగుండేది. అప్పుడే జోష్‌గా ఉంటుంది. లేకపోతే ఆ కలర్‌ మాదిరిగానే డల్‌గా అనిపిస్తుంది. ఆసీస్‌తో తొలి టీ20లో కానీ భారత బౌలింగ్‌ ఉన్నట్లుగా..” అని డానిష్ కనేరియా వ్యాఖ్యానించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version