అర్హులైన వారందరికీ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలి : మంత్రి మల్లారెడ్డి

-

జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా అన్ని రంగాల్లోనూ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నదని అన్నారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు మంత్రి మల్లారెడ్డి. సీఎం కేసీఆర్‌ ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టినట్లు మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా అధికారులు కృషి చేయాలన్నారు.జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు మంత్రి మల్లారెడ్డి.

మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ. 7, 200 కోట్ల నిధులను కేటాయించి అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు మంత్రి మల్లారెడ్డి. దీంతో, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు. జిల్లాలో ఉన్న గురుకులాల్లో మంచి సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాలలో సమస్యలు తలెత్తకుండా అధికారులు తనిఖీలు చేయాలని ఆదేశించారు మంత్రి మల్లారెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version