కేప్ టౌన్ వేదికగా జరుగుతున్ మూడో టెస్టు లో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా దారుణమైన ఓటమి పాలైంది. 7 వికెట్ల తేడాతో టీమిండియాను సౌత్ ఆఫ్రికా చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. మరోక రోజు మిగిలి ఉండగానే సౌత్ ఆఫ్రికా మూడో టెస్టు లో విజయం సాధించింది. రెండు ఇన్నింగ్స్ లో టీమిండియా ఇచ్చిన 212 టార్గెట్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్ మెన్లు ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకున్నారు.
సౌతాఫ్రికా మిడిల్ ఆర్డర్ పిటర్సన్ (82) పరుగులతో రాణించడంతో సునయాసంగా విజయం సాధించింది. కేవలం మూడు వికెట్లను కొల్పోయి సౌత్ ఆఫ్రికా విజయ తీరాలను తాకింది. కాగ మూడో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 223 పరుగులను చేసింది. అనంతరం సౌత్ ఆఫ్రికా 210 పరుగులు మాత్రమే చేసింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కేవలం 198 పరుగులు మాత్రమే చేయకలిగింది. దీంతో 212 టార్గెట్ తో సౌత్ ఆఫ్రికా బరిలోకి దిగి ఐదో రోజు ఆట మిగిలి ఉండగానే విజయం సాధించింది.