టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లి ని తప్పించి రోహిత్ శర్మ ను బీసీసీఐ ఎంచుకున్న విషయం తెలిసిందే. అయితే దీని పై క్రికెట్ అభిమనులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వన్డే జట్టు కు విరాట్ కోహ్లి కెప్టెన్ నుంచి తప్పు కోవాలని భావించలేదని.. బీసీసీఐ యే విరాట్ కోహ్లి ని కెప్టెన్సీ బాధ్యత ల నుంచి తప్పించిందని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా అంటున్నారు. దీంతో కెప్టెన్సీ మార్పు పై కాస్త వివాదం చోటు చేసుకుంది. అయితే ఈ వివాదం పై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వివరణ ఇచ్చాడు.
గతం లో టీ 20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి ను తప్పుకోవద్దని తన తో పాటు బీసీసీఐ కూడా కోరిందని అన్నారు. అయితే తమ మాటను పట్టించు కోకుండా.. విరాట్ కోహ్లి టీ 20 జట్టు కెప్టెన్సీ బాధ్యత ల నుంచి తప్పకున్నాడని అన్నాడు. అయితే వైట్ బాల్ క్రికెట్ కు ఇద్దరు నాయకత్వం వహిస్తే.. టీమ్ కు భారీ నష్టం వస్తుందని అన్నారు. అందుకే టీ 20, వన్డే జట్టు లకు ఒకరి నే కెప్టెన్ గా నియమించాలని భావించామని తెలిపారు. అందులో భాగం గా నే రోహిత్ శర్మ ను వన్డే జట్టు కు కెప్టెన్ గా నియమించామని వివరించాడు.