మార‌ని తీరు.. రెండో వ‌న్డేలోనూ టీమిండియా ఓట‌మి

-

కెఎల్ రాహుల్ నేతృత్వంలోని టీమిండియా తీరు మార‌లేదు. సౌత్ ఆఫ్రికాతో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్ లో వ‌రుసగా ఓట‌మిల పాలైవుతుంది. ఇప్ప‌టికే మొద‌టి వ‌న్డే మ్యాచ్ లో ఓడిపోయి.. రెండో వ‌న్డే మ్యాచ్ బ‌రిలోకి దిగిన టీమిండియాకు నిరాశే ఎదురు అయింది. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్లు.. స‌మీష్టిగా పోరాడంతో టీమిండియా ఓట‌మి త‌ప్ప‌లేదు. ఛేద‌న‌లో సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్లు అద్భుతంగా రాణించారు. ఓపెన‌ర్లు మ‌ల‌న్ (91) , క్వింట‌న్ డికాక్ (78) ఇద్ద‌రు కూడా హాఫ్ సెంచ‌రీల‌తో క‌దం తోక్కారు. దీంతో సౌతాఫ్రికా ముందు ఉన్న టార్గెట్ చిన్న బోయింది.

వీరి త‌ర్వాత బ్యాటింగ్ వ‌చ్చిన డ‌సెన్ (37), మార్ క్ర‌మ్ (37), కెప్టెన్ బ‌వుమా (35) రాణించ‌డంతో గెలుపు లంచ‌నం అయింది. భార‌త బౌల‌ర్లు చాహల్, బుమ్రా, శార్ధుల్ ఠాకూర్ ఒక్కో వికెట్ చొప్ప‌న ప‌డ‌గొట్టారు. కేవలం మూడు వికెట్లు కోల్పోయి.. 288 ప‌రుగుల ల‌క్ష్యాన్ని అందుకుంది. దీంతో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. దీంతో మూడు వ‌న్డేల ఈ సిరీస్ ను సౌతాఫ్రికా కైవ‌సం చేసుకుంది. కాగ మ్యాచ్ లో 78 ప‌రుగుల తో రాణించిన క్వింట‌న్ డికాక్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది.

Read more RELATED
Recommended to you

Latest news