రిష‌బ్ పంత్‌, మాథ్యూ వేడ్‌ల మ‌ధ్య వాడి వేడి సంభాష‌ణ‌.. వీడియో..

-

క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్. కానీ ఇంగ్లిష్ క్రికెట‌ర్లు ఇత‌ర దేశాల‌కు చెందిన క్రికెట‌ర్ల‌ను స్లెడ్జింగ్ చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటారు. అందులోనూ ఆస్ట్రేలియా ప్లేయ‌ర్లు ఈ విష‌యంలో రెండాకులు ఎక్కువే చ‌దివారు. ఈ క్ర‌మంలోనే మెల్‌బోర్న్‌లో జ‌రుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భార‌త ప్లేయ‌ర్ పంత్‌, ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ మాథ్యూ వేడ్‌ల మ‌ధ్య వాడి వేడి సంభాష‌ణ జ‌రిగింది. ఆ సంభాషణ స్టంప్ మైక్ లో రికార్డు అయ్యింది.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సంద‌ర్భంగా ఆ జ‌ట్టు ప్లేయ‌ర్ మాథ్యూ వేడ్ బుమ్రా వేసిన ఓ బంతిని ఆడాడు. అయితే అత‌ని బ్యాటింగ్ న‌చ్చ‌లేదేమో, మ‌రొక విష‌య‌మో తెలియ‌దు కానీ.. వికెట్ల వెనుక ఉన్న పంత్.. హె హె హె.. అన్నాడు. అందుకు వేడ్ స్పందించాడు. తాను కూడా హె హె హె.. అని అంటూనే గ్రౌండ్‌లో ఉన్న బిగ్ స్క్రీన్‌పై నిన్ను నువ్వు చూసుకున్నావా ? అందుకే హె హె హె అంటున్నావు.. అని వేడ్ అన్నాడు. కాగా వారిద్ద‌రూ అలా మాట్లాడుకున్న మాట‌లు రికార్డ‌య్యాయి. ఈ క్ర‌మంలో ఆ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

కాగా ఆస్ట్రేలియా‌తో మెల్‌బోర్న్‌లో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో 3వ రోజు భార‌త్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 326 ప‌రుగుల‌కు ఆలౌట్ అవ‌గా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. ప్ర‌స్తుతం జ‌ట్టు స్కోరు 6 వికెట్ల‌కు 128 ప‌రుగుల వ‌ద్ద కొన‌సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version