చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్లో ఈ జట్టుకు మామూలు క్రేజ్ ఉండదు. ఇంతటి క్రేజ్కు 90 శాతం కారణం ఆ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ. సీఎస్కే-ధోని డెడ్లీ కాంబినేషన్. కానీ ఇప్పుడు ఆ కాంబో లేదు. తొలి సీజన్ నుంచి జట్టును నడిపించిన నాయకుడు ఒక్కసారిగా వైదొలిగాడు. అది కూడా ఐపీఎల్ 2024 ప్రారంభానికి ఒక్కరోజు ముందు. ధోని ఈ నిర్ణయంతో ఫ్యాన్స్ ఎంతో నిరాశ చెందారు. మరోవైపు సీఎస్కేకు ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్‌ను సారథిగా నియమిస్తూ ఆ జట్టు కీలక ప్రకటన చేసింది.
అయితే ఈ నిర్ణయం తీసుకునే సమయంలో డ్రెస్సింగ్ రూమ్ అంతా నిశ్శబ్దంతో నిండిపోయిందని సీఎస్కే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పాడు. ధోనీ తన నిర్ణయం వెల్లడించినప్పుడు డ్రెస్సింగ్ రూమ్ భావోద్వేగాలతో నిండిపోయిందని తెలిపాడు. ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారని వెల్లడించాడు. “ఇప్పుడు రుతురాజ్‌కు కెప్టెన్సీ అప్పగించాం. అందరూ అతడికి శుభాకాంక్షలు చెప్పారు. అతడు అద్భుతతమైన ఆటగాడు. జట్టును సరైన దిశలో నడిపించే సత్తా అతడికి ఉంది’’ అని ఫ్లెమింగ్ తెలిపాడు.