ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఏపీలో తాజాగా విద్యుత్ ఛార్జీలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. 30 యూనిట్ల వరకు యూనిట్ 45 పైసల చొప్పున ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
31 – 75 యూనిట్ల వరకు యూనిట్ కు 91 పైసలు పెంచుతూ నిర్నయం తీసుకుంది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. 76 – 125 యూనిట్ల వరకు యూనిట్ కు రూ. 1.40 పైసలు పెంచేసింది సర్కార్. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్.
అలాగే 126 నుంచి 225 యూనిట్ల వరకు యూనిట్ కు రూ.6 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 226 నుంచి 400 యూనిట్ల వరకు యూనిట్ కు రూ.8.75 పెంచేసింది. 400 యూనిట్లపైన యూనిట్ కు రూ.9.75 పెంచుతూ నిర్ణయం తీసుకుంది సర్కార్. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. ఇక పెరిగిన కరెంట్ ఛార్జీలతో.. రూ.1400 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రానుంది.