Xiaomi Redmi Note 11 review : 108 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు అదిరిపోయే ఫీచర్స్

-

చైన్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ.. రెడ్‌మీ నోట్ సిరీస్ లో 11 మోడల్ విడుదల చేసింది. దీనికంటే ముందు వర్షన్ అయిన రెడ్‌మీ నోట్ 10లో కొన్ని ముఖ్యమైన అప్‌డేట్స్‌ను ఈ మోడల్ కు తీసుకొచ్చింది. రెడ్‌మీ ఫోన్ మోడల్స్.. అన్నీ కన్ఫ్యూస్ గా ఉంటాయి. అన్నీ ఒకేలా ఉన్నట్లు ఉంటాయి.. కానీ బోలెడు తేడాలు ఉంటాయి. చైనాలో రెడ్‌మీ 11, రెడ్‌మీ 11 ఫోర్ జీ వంటి మోడల్స్ ఉన్నాయి. అలాగే రెడ్ మీ నోట్ 11 ఎస్ అనే మోడల్ కూడా ఉంది. ఇది వేరే మోడల్. ఈ మోడల్‌లో మీడియాటెక్ చిప్ సెట్‌తో పాటు 108 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈరోజు మనం ఈ ఫోన్ రివ్యూ చూద్దాం.
రెడ్‌మీ నోట్ 11 హైలెట్స్ :
ఓఎస్ : అండ్రాయిడ్ 11, ఎంఐయూఐ 13.
ప్రంట్ కెమెరా : 13 మెగా పిక్సెల్ , f/2.4, (wide)
బాడీ : 159.9×73.9×8.1mm, 179g; ప్లాస్టిక్ బాడీ ; IP53, డస్ట్, స్ప్లాష్‌ నుంచి రక్షణ
డిస్‌ప్లే : 6.43″ AMOLED, 90Hz, 700 nits, 1000 nits ( పీక్), 1080x2400px రిజల్యూషన్ , 20:9 యాస్పెక్ట్ రేషియో , 409 పీపీఐ
చిప్‌సెట్ : కాల్కం SM6225 స్నాప్ డ్రాగన్ 680 4G (6 nm): అక్టాకోర్ (4×2.4 GHz Kryo 265 Gold & 4×1.9 GHz Kryo 265 Silver); Adreno 610.
మెమరీ : 64GB 4GB RAM, 64GB 6GB RAM, 128GB 4GB RAM, 128GB 6GB RAM; UFS 2.2; microSDXC ( ప్రత్యేకమైన స్లాట్).
రియర్ కెమెరా : వైడ్ మెయిన్ : 50 మెగాపిక్సెల్ f/1.8, 26mm, PDAF; అల్ట్రా వైడ్ యాంగిల్ : 8 MP, f/2.2, 118-degree;
Macro: 2 MP, f/2.4; Depth: 2 MP, f/2.4.
వీడియో క్యాప్చర్ : రియర్ కెమెరా : 1080p@30fps; ఫ్రంట్ కెమెరా : 1080p@30fps.
బ్యాటరీ : 5000mAh; ఫాస్ట్ చార్జింగ్ g 33W, 60 నిమిషాల్లో వంద శాతం చార్జింగ్ , Power Delivery 3.0, Quick Charge 3+.
ఫింగర్ ప్రింట్ రీడర్, ఇన్ ఫ్రా రెడ్ పోర్ట్, 3.5mm జాక్ ; వర్చువల్ పాక్సిమటీ సెన్సార్ వంటివి ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
రెడ్‌మీ నోట్ ధర మన బడ్జెట్ లో నే ఉంది. ఆన్ లైన్ పోర్టర్స్‌లో రూ. 14వేల నుంచి లభ్యమవుతున్నాయి. 4, 6 జీబీ వేరియంట్లలో మార్కెట్లోకి విడుదల చేశారు. అయితే.. పేరుకు 11 అయినప్పటికీ.. రెడ్‌మీ 10తో పోలిస్తే.. అన్నీ అప్ గ్రేడ్ అవ్వలేదు. డ్యూయల్ స్టీరియోస్పీకర్ ఉండటం వల్ల మరింత మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. ప్రీమియం లుకింగ్ ఫినిషింగ్ ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. ఫోన్ మెటీరియల్ నాణ్యత కూడా రెడ్‌మీ స్టాండర్డ్స్‌లోనే ఉంది. కొత్త ఫోన్ కొనాలనుకునేవారికి.. ఈ ఫోన్ మంచి ఎంపికే.!

Read more RELATED
Recommended to you

Exit mobile version