2024 ప్రపంచ చెస్ ఛాంపియన్ అవతరించాడు తూర్పు గోదావరి జిల్లా కి చెందిన తెలుగు బిడ్డ డి గుకేష్. చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించిన గుకేష్ దొమ్మరాజు.. అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా ఘనత అందుకున్నాడు. 14వ రౌండ్‌లో ప్రస్తుత ఛాంపియన్ డింగ్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్న గుకేష్.. 2012లో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత మొదటి భారతీయ ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు.
క్యాండిడేట్స్ 2024 టోర్నమెంట్, చెస్ ఒలింపియాడ్ స్వర్ణాన్ని కూడా గెలుచుకున్న గుకేష్..
చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. 2750 రేటింగ్‌ను చేరుకున్న అతి కొద్దిమంది వ్యక్తులలో ఒకడిగా నిలిచిన గుకేశ్.. ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ కోసం పోటీ పడిన అతి పిన్న వయస్కుడిగా కూడా రికార్డ్ నెలకొల్పాడు. 7 ఏళ్ల వయసు నుంచే చెస్ ఆడుతున్న గుకేష్.. గత 36 ఏళ్లలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.