టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

-

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఇవాళ ఢిల్లీ సొంత గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతోంది. అయితే టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ ముంబై జట్టుకు చాలా కీలకం అనే చెప్పాలి. ముంబై ఇప్పటికే ఓటమి చెంది పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ మాత్రం ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఘన విజయాలు సాధించుకుంటూ వస్తోంది. మరీ ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

ముంబై జట్టు : రోహిత్ శర్మ, రికెల్టన్, జాక్స్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్, శాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, బుమ్రా.

ఢిల్లీ క్యాపిటల్స్ : మెక్ గుర్క్, పోరెల్, కే.ఎల్.రాహుల్, స్టబ్స్, అక్షర్ పటేల్, అశుతోష్, విప్రజ్, స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేశ్.

Read more RELATED
Recommended to you

Latest news