ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తర పోరు జరిగింది. తొలుత టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 173 పరుగులు చేసింది. జైస్వాల్ 75, ధృవ్ 35, పరాగ్ 30 రాణించారు. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆర్సీబీ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 17 ఓవర్లలోనే మ్యాచ్ ని ఫినిష్ చేసింది.
ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ 1, యశ్ దయాల్ 1, హజిల్ వుడ్ 1, పాండ్య 1 వికెట్ తీసుకున్నారు. ఆర్సీబీ బ్యాటర్లలో సాల్ట్ 65, కోహ్లీ 62 నాటౌట్, పడిక్కల్ 40 కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆర్సీబీ అలవకగా ఛేదించింది. కార్తికేయ బౌలింగ్ లో ఆర్సీబీ ఓపెనర్ సాల్ట్ యశ్వాల్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 92 పరుగుల వద్ద సాల్ట్ ఔట్ అయ్యాడు. మిగిలిన పరుగులను కోహ్లీ, పడిక్కల్ నెమ్మదిగా ఆడి విజయవంతంగా పూర్తి చేశారు.