ధోనీ తొలి ప్రేమ విషాదాంతం.. రోడ్డు ప్ర‌మాదంలో ప్రేయ‌సి మ‌ర‌ణం

-

ఓ వైపు రాష్ట్ర స్థాయిలో క్రికెట్ ఆడుతూ… జాతీయ జట్టులో స్థానం కోసం ధోనీ ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ప్రియాంకతో ధోనీకి పరిచయం ఏర్పడుతుంది. తర్వాత ఇద్దరూ ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు.

ఎంఎస్ ధోనీ.. సాక్షిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ.. ఆయనకు పెళ్లి ముందే కొన్ని ప్రేమ వ్యవహారాలు ఉన్నాయని అందరికీ తెలుసు. అయితే.. ధోనీ తన తొలి ప్రేయసి స్కూల్‌లో చదివే సమయంలో ఉండేదట. 12వ తరగతి తర్వాత ధోనీ ఇప్పటి వరకు ఆమె ముఖం కూడా చూడలేదట. 12వ తరగతిలో ఉన్నప్పుడే ధోనీ ఆమెను చివరిసారి కలిశాడు. దీంతో ధోనీ మొదటి ప్రేమ 12వ తరగతిలోనే ఆగిపోయిందన్నమాట.

అయితే.. ఎంఎస్ ధోనీ అన్‌టోల్డ్ స్టోరీ అంటూ బాలీవుడ్‌లో ధోనీ జీవితం మీద సినిమా వచ్చింది. ఆ సినిమాలో మాత్రం ధోనీ ప్రేయసి ప్రియాంక ఝా గురించి ప్రస్తావించారు. ధోనీ 20 ఏళ్ల వయసులో ఉన్నప్పటి ప్రేమ కథ అది.

MS Dhoni and Priyanka Jha
MS Dhoni and Priyanka Jha

ఓ వైపు రాష్ట్ర స్థాయిలో క్రికెట్ ఆడుతూ… జాతీయ జట్టులో స్థానం కోసం ధోనీ ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ప్రియాంకతో ధోనీకి పరిచయం ఏర్పడుతుంది. తర్వాత ఇద్దరూ ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. కానీ.. దురదృష్టవశాత్తు ప్రియాంక రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ప్రియాంక చనిపోయినప్పుడు ధోనీ రాంచీలో లేడు. క్రికెట్ టోర్నీ కోసం వేరే దేశానికి వెళ్లాడు. అప్పటికే ధోనీ.. టీమిండియా జట్టులో సెలెక్ట్ అయిపోయాడు. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు కూడా ఆడటం ప్రారంభించాడు. ఆసమయంలోనే ప్రియాంక రోడ్డు ప్రమాదంతో చనిపోవడంతో.. ఆ గాయం నుంచి కోలుకోవడానికి ధోనీకి సంవత్సరం పట్టింది. ఆ తర్వాత ధోనీకి సాక్షితో పరిచయం అవడం.. ఇద్దరూ పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news