అసలు అంతర్జాతీయ క్రికెట్ లో టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆడతాడా…? లేదా…? ఈ ప్రశ్నకు ధోని నుంచి సమాధానం వస్తే మినహా ఎవరూ సమాధానం చెప్పే పరిస్థితి కనపడటం లేదు. గత కొంత కాలంగా ధోని జట్టుకు దూరంగా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ధోని చివరి మ్యాచ్ ఆడింది ప్రపంచకప్ సమయంలో. న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆడాడు ధోనీ.
ఆ తర్వాత ఆర్మీ శిక్షణలో పాల్గొనడం, పలు టూర్లకు సెలెక్షన్ కమిటికి అందుబాటులోకి లేకపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక తప్పుకోవడం ఖాయమని భావించారు. ఇక బోర్డ్ కూడా ధోని విషయంలో ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. 38 ఏళ్ళ ధోని ఇప్పుడు ఫాంలో కూడా లేడు. ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీం ఓటమి అతనే కారణమనే విమర్శలు కూడా వినిపించాయి.
తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ధోనీని టీమిండియా కాంట్రాక్ట్ నుంచి తప్పించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీంయాశమైంది. దీనితో క్రికెట్ లో ధోనీ ప్రస్తానం ముగిసిందని భావించారు అందరూ. అటు మీడియా ఇటు అభిమానులు దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం చేసారు. ఈ తరుణంలో ధోని అందరిని ఆశ్చర్యపరచాడంతో పాటుగా తనను కాంట్రాక్ట్ నుంచి తప్పించిన బోర్డ్ కి షాక్ ఇచ్చాడు.
ఎంఎస్ ధోనీ గ్రౌండ్‌లో మెరిసి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. కాంట్రాక్ట్ నుంచి తప్పించిన రోజే బ్యాట్ పట్టి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. గురువారం రాంచీలో మైదానంలో జార్ఖండ్ రంజీ టీమ్ సభ్యులతో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. బ్యాటింగ్‌తో పాటు రెగ్యులర్ ట్రైనింగ్‌లో కూడా ఎంఎస్ ధోనీ భాగమైనట్లు జార్ఖండ్ టీమ్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం ప్రత్యేకంగా మెషీన్ తెప్పించుకున్నట్లు తెలుస్తుంది.