ధావన్‌ పని అయిపోయింది? గబ్బర్‌పై దినేశ్ కార్తీక్‌ సంచలన వ్యాఖ్యలు

-

శిఖర్ ధావన్‌ పని అయిపోయింది అంటూ గబ్బర్‌పై దినేశ్ కార్తీక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ తో చెలరేగడంతో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. ఓవైపు శుబ్ మన్ గిల్, మరోవైపు ఇషాన్ కిషన్ తో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో శిఖర ధావన్ వన్డే జట్టులో కొనసాగడం కష్టంగా మారింది. కొత్త సెలెక్షన్ కమిటీ ధావన్ భవితవ్యం పై తుది నిర్ణయం తీసుకుంది.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బలి పశువయ్యేది శిఖర్ ధావనేనని వెటరాన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అన్నాడు. ‘శ్రీలంకతో జరగనున్న సిరీస్ లో ధావన్ కు ఏ స్థానం ఇస్తారు? ఇషాన్ కిషన్ వంటి ఆడగాడిని ఎలా తప్పిస్తారు? అది ఎలా చేస్తారనేది ఆసక్తికరం. శుబ్ మన్ గిల్ సైతం అద్భుతంగా ఆడుతున్నాడు. రోహిత్ శర్మ అందుబాటులోకి వస్తే ఎవరో ఒకరు జట్టుకు దూరం కావాల్సి ఉంటుంది. నాకు తెలిసి అది దావనే అవుతాడు. అదే జరిగితే, అతని అద్భుతమైన కెరీర్ కు బాధాకరమైన ముగింపు తప్పదేమో. అయితే, ఈ విషయంలో సెలెక్టర్లు స్పందించాల్సి ఉంది’.అంటూ దినేష్‌ కార్తీక్‌ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version