214 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్.. టీమిండియా ఘన విజయం

-

అహ్మదాబాద్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 356 పరుగులు చేసింది. ఓపెనర్ గిల్ సెంచరీ చేయడంతో భారత్ భారీ స్కోర్ చేసిందనే చెప్పాలి. ఓపెనర్ గిల్ తో పాటు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో 50 ఓవర్లు భారత్ 356 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమైనప్పటికీ మిగతా బ్యాటర్లు అంతా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఇంగ్లండ్ బౌలింగ్ లో అత్యధికంగా అదిల్ రషీద్ 4, మార్క్ వుడ్ 2 వికెట్లు, సాకిబ్ మహముద్, గన్ అట్కిసన్, జోరూట్ తలో వికెట్ పడగొట్టారు.

357 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలుత 60 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోదు. 6.2 నుంచి వికెట్ల పతనం మొదలైంది. దీంతో ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ ను భారత్ వైట్ వాష్ చేసింది. దాదాపు 142 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 357 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 214 పరుగులకే కుప్పకూలింది. అట్కిన్సన్, బాంటన్ చెరో 38 రన్స్ తో టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్ దీప్, హర్షిత్, హార్దిక్, అక్షర్ తలో 2 వికెట్లు, సుందర్, కుల్దీప్ చెరో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news