Ben Stokes: టెస్టు క్రికెట్‌లో బెన్‌ స్టోక్స్‌ వరల్డ్ రికార్డు

-

ఇంగ్లాండ్​ టెస్టు కెప్టెన్​, ఆల్​ రౌండర్​ బెన్​ స్టోక్స్​ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. టెస్టు క్రికెట్​ చరిత్రలో అత్యధిక సిక్సులు బాదిన క్రికెటర్​గా నిలిచాడు. బే ఓవల్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్​, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో స్టోక్స్​ ఈ ఫీట్ అందుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు సాధించిన న్యూజిలాండ్​ మాజీ ప్లేయర్ బ్రెండన్​ మెక్​ కల్లమ్​ను అధిగమించి ఈ ఘనతను సాధించాడు.

బ్రెండన్​ మెక్​ కల్లమ్​ ప్రస్తుతం ఇంగ్లాండ్​ టెస్టు ఫార్మాట్​ హెడ్​ కోచ్ కావడం గమనార్హం. ఇప్పటి వరకు 90 టెస్టులు ఆడిన బెన్​ స్టోక్స్​ 109 సిక్సులు బాదాడు. 36 సగటుతో మొత్తం 5,652 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 28 హాఫ్​ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ టెస్టు ఫార్మాట్​లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 258 పరుగులు చేశాడు బెన్ స్టోక్స్.

Read more RELATED
Recommended to you

Exit mobile version