హార్దిక్ పాండ్యాతో డేటింగ్…ఆ హీరోయిన్ అరాచకం !

-

ప్రముఖ టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హార్దిక్ పాండ్యా తనదైన ఆట తీరుతో టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించారు. కాగా గత కొద్ది రోజుల నుంచి హార్దిక్ పాండ్యా అనేకమంది హీరోయిన్లతో డేటింగ్ చేస్తున్నట్లు అనేక రకాల వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి ఈషా గుప్తాతో హార్దిక్ పాండ్యా డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఓ రూమర్ వైరల్ అయింది.

Esha Gupta BREAKS Silence On Hardik Pandya Dating Rumours
Esha Gupta BREAKS Silence On Hardik Pandya Dating Rumours

దీంతో ఈ వార్తలపై ఈషా గుప్తా క్లారిటీ ఇచ్చారు. నేను, హార్దిక్ పాండ్యా కొన్ని నెలల పాటు మాట్లాడుకున్నాము. వ్యక్తిగతంగా రెండుసార్లు ఇద్దరం కలిసాము. కానీ దానిని డేటింగ్ అనలేము. డేటింగ్ స్టేజ్ కి వెళ్లేముందే మా బంధం విడిపోయింది. ప్రస్తుతం మేమిద్దరం ఒకరితో మరొకరం కాంటాక్ట్ లో లేమని ఈషా గుప్తా క్లారిటీ ఇచ్చారు. దీంతో వీరిద్దరిపై వస్తున్న వార్తలకు చెక్ పడింది. కాగా, వీరిద్దరూ 2018 సంవత్సరంలో డేటింగ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ రూమర్ పై ప్రతి ఒక్కరికి క్లారిటీ రావడంతో ఈ వార్తలకు ముగింపు పలికింది.

Read more RELATED
Recommended to you

Latest news