WORLD RECORD: రోహిత్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ “హుష్ కాకి”… !

-

ఆసియన్ గేమ్స్ లో ఈ రోజు ఉదయం జరిగిన టీ 20 మ్యాచ్ లో సంచలన రికార్డులు నమోదు అయ్యాయి. మంగోలియా తో తలపడిన నేపాల్ జట్టు మోడేటి బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్ లలో మూడు వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఈ భారీ స్కోర్ లో కుషాల్ మల్లా సెంచరీ తో ఆకట్టుకోగాకెప్టె రోహిత్ పౌడెల్ మరియు దీపేంద్ర సింగ్ ఐరీలు అర్ద సెంచరీ లతో రాణించారు. అయితే ఇంతకు ముందు వరకు అంతర్జాతీయ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ మరియు మిల్లర్ ల పేరిట ఉండేది.. వీరిద్దరూ 35 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డును నమోదు చేశారు. కానీ ఇంతకాలం కాచుకుంటూ వచ్చిన ఈ రికార్డును ఈ రోజు బద్దలు కొట్టాడు నేపాల్ క్రికెటర్ కుషాల్ మల్లా… ఇతను కేవలం 34 బంతుల్లోనే సెంచరీ చేసి ఈ రికార్డును అధిగమించాడు..

కుషాల్ మల్లా ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు మరియు 12 సిక్సులు సహాయంతో బంతుల్లో 137 పరుగులు చేసి కొత్త రికార్డును సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్ లో నేపాల్ జట్టు టీ 20 లలో అత్యధిక పరుగులు 314 చేసింది..

Read more RELATED
Recommended to you

Latest news