Glenn Maxwell announces ODI retirement: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. రిటైర్మెంట్ పై గ్లెన్ మాక్స్వెల్ కీలక ప్రకటన చేసాడు. వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్. ఇక పై టీ20లపై దృష్టి సారించబోతున్నట్లు వెల్లడించాడు గ్లెన్ మాక్స్వెల్. 2012 నుండి 2025 వరకు తన కెరీర్ లో 149 వన్డేలు ఆడి 3990 పరుగులు చేసి 77 వికెట్లు పడగొట్టాడు.

2015 మరియు 2023లో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలిచిన జట్లలో కూడా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఒకడు కావడం విశేషం. మాక్స్వెల్ 126.70 స్ట్రైక్ రేట్ తో సగటున 33.81 పరుగులు సాధించాడు. ఇక ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడన్న వార్త రాగానే ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.