మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు.. ఒంటరిగానే 100 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రకటించారు హరీష్ రావు. ఎవరో పొత్తు పెట్టుకున్నం అన్నట్లు, ఇంకెవరో పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నారు.. మేము ఎవరితో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు హరీష్ రావు.

ఒక్కనాడు కూడా జై తెలంగాణ అనని వ్యక్తి, ఉద్యమకారులపైకి రైఫిల్ ఎక్కుపెట్టిన వ్యక్తి ఈ రైఫిల్ రెడ్డి అలియాస్ రేవంత్ రెడ్డి అంటూ చురకలు అంటించారు. అలాంటి రైఫిల్ రెడ్డి కూడా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడని ఆగ్రహించారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే జిరాక్స్ కాపీ ఇచ్చి తప్పించుకున్నాడు అని పేర్కొన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.