భారత క్రికెట్ ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపిఎల్ కి సంబంధించి, ఐపిఎల్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఐపిఎల్ ని ఈ ఏడాది యుఏఈ లో నిర్వహిస్తామని ప్రకటించారు ఐపిఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్. తాజాగా ఆయన దీనిపై ఒక ప్రకటన చేసారు. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఐపిఎల్ ని యుఏఈ లో నిర్వహించాలని తాము భావిస్తున్నామని, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
యుఏఈలో ఐపిఎల్ నిర్వహణకు సంబంధించి తాము కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే దరఖాస్తు చేశామన్నారు ఆయన. నిన్న టి20 ప్రపంచకప్ ని వాయిదా వేసినట్లు ఐసిసి ప్రకటన చేసింది. ఇక అక్కడి నుంచి భారీ ఆదరణ ఉన్న ఐపిఎల్ మీదనే చర్చలు అన్నీ జరిగాయి. క్వారంటైన్ సహా అనేక కరోనా నిబంధనలను పాటించి ఐపిఎల్ ని నిర్వహిస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలోనే షెడ్యుల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.