Asia Cup 2022 : మొదట ఆదివారం పాకిస్తాన్తో ఓడిన ఇండియా నిన్న శ్రీలంక చేతిలో పరాభవానికి గురైంది. ఇండియా పై శ్రీలంక ఏకంగా ఆర్ వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే… శ్రీలంక పై ఓటమి అనంతరం భజ్జి తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ జట్టు మేనేజ్మెంట్ పై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
ఉమ్రాన్ మాలిక్, దీపక్ చాహార్ లాంటి ఆటగాళ్లు జట్టులో ఎందుకు భాగం కావడం లేదని ప్రశ్నించారు. దినేష్ కార్తీక్ కు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదని నిలదీశాడు. ‘150కి.మీ ల వేగంతో బౌలింగ్ చేసే ఉమ్రాన్ మాలిక్ ను ఎక్కడ ఉంచారు? అత్యుత్తమ స్వింగ్ బౌలర్ అయిన దీపక్ చాహార్ ను ఎందుకు పట్టించుకోరు. ఈ కుర్రాళ్ళు అవకాశాలకు అర్హులు కాదా చెప్పండి? దినేష్ కార్తీక్ కు ఎందుకు నిలకడగా అవకాశాలు ఇవ్వట్లేదు? జట్టు మేనేజ్మెంట్ నన్ను నిరాశపరిచింది’ అని సింగ్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. లంక చేతిలో ఓడిపోవడంతో భారత్ ఫైనల్ కు చేరే అవకాశాలు పూర్తిగా దిబ్బతిన్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ ఫైనల్ కు చేరదు.